తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్‌రాజు జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఇప్పటివరకు ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు తీసారు. 2003లో వచ్చిన ‘దిల్’ సినిమాతో దిల్‌రాజు నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో తన పేరు ముందు ‘దిల్’ అని పెట్టుకున్నారు. ఆ తర్వాత వరుసగా ‘ఆర్య’, ‘బొమ్మరిల్లు’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘సతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించారు. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలోనే టాప్ ప్రొడ్యూసర్. అయితే తాజాగా దిల్ రాజు మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. దిల్ రాజు భార్య అనిత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాత తన ఒక్కగానొక్క కుమార్తెకు పెళ్లి చేసి పంపించారు. కూతురు అత్తగారింటికి వెళ్లిపోవడంతో దిల్ రాజు ఒంటరిగా ఉంటున్నారట. అందుకే మళ్లీ పెళ్లి చేసుకుని తన జీవితానికి ఓ తోడు కావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. సినీ నేపథ్యంలేని బ్రాహ్మణ యువతితో దిల్ రాజు పెళ్లి జరగనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ రూమర్స్‌లో ఎంత నిజం ఉందో తెలియాలంటే దిల్‌రాజే స్పందించాలి.
previous post