తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ప్రతి స్థాయిలో సుపరిపాలన, సమృద్ధి కావాలనుకుంటే మీ అమూల్యమైన ఓటు ఎంతో అవసరమని ఆయన అన్నారు.
నేటి తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో భారీ సంఖ్యలో పాల్గొని సమర్థవంతమైన అభ్యర్థులను ఎన్నుకోమని ఓటరు మహాశయులందరికి నా సవినయ మనవి. కిషన్ రెడ్డి తెలుగుతో పాటు ఇంగ్లిషులో ట్వీట్లు చేశారు. మునిసిపల్ ఎన్నికల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
రాబోయే పదేళ్లలో స్టాలిన్ దేశానికీ ప్రధాని అవుతారు…