telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కొండెక్కుతున్న ఉల్లి, టమోటా ధరలు..

onion and tomato prices going high

నిత్యావసరాల్లో చాలా ముఖ్యమైన ఉల్లి, టమాటాల ధరలు గత 10 రోజులగా చుక్కలు చూపిస్తున్నాయి. 10 రోజుల క్రితం 10రూపాయలకు వస్తున్న టమాటో ఇప్పుడు కేజీ టమోటాలు 42 రూపాయిలు చొప్పున అమ్ముతున్నారు. వర్షాకాలం కారణంగా చింతూరు జిల్లా మదనపల్లె నుంచి వచ్చే టమాటా తగ్గిపోయింది. దీంతో కర్ణాటకలోని కోలార్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అనంతపురం జిల్లా నుంచి కొంత టమోటా రప్పిస్తున్నారు. సరిగ్గా రెండు రోజుల క్రితం సోమవారం టమాటా రైతు బజార్ లో కిలో 16 రూపాయిలు ఉండేది. మంగళవారం ఈ రేటు కాస్త పెరిగి 20రూపాయలకు చేరింది. బుధవారం నాటికీ 26రూపాయలకు చేరింది. ఈరోజు ఏకంగా 42 రూపాయలకు చేరింది.

కేవలం మూడు రోజుల్లో 26 రూపాయిలు పెరిగింది. ఈ రేటు బోయినపల్లి మార్కెట్ లోది. ఇంకా అక్కడ కొని బయట అమ్మే వారి రేటు.. వారు ఎంతకీ అమ్మితే అంత. అయితే మరో వారంలో ధర తగ్గే అవకాశం ఉంది అని అంటున్నారు. గత వారం భారీ వర్షాల కారణంగా రేట్లు అధికంగా పెరిగాయని, ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి వచ్చే వారం తగ్గవచ్చు అని అంచనా వేస్తున్నారు.

Related posts