telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

ఇంగ్లాండ్ కొత్త కోచ్‌గా క్రిస్ సిల్వర్‌వుడ్

chris silverwood

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు కొత్త కోచ్‌ ను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఎంపిక చేసింది. క్రిస్ సిల్వర్‌వుడ్ ను హెడ్ కోచ్‌ గా నియమితులయ్యాడు. ప్రధాన కోచ్ ఎంపికపై సుదీర్ఘంగా చర్చించిన ఈసీబీ అన్ని ఫార్మాట్లకు క్రిస్‌నే ఎంపిక చేసింది. దీంతో ఇంగ్లీష్ జట్టును విశ్వవిజేతగా నిలుపడంలో కీలక పాత్ర పోషించి.. మార్గనిర్దేశనం చేసిన ట్రెవర్ బేలిస్ స్థానంలో కోచ్‌గా క్రిస్ బాధ్యతలు చేపట్టనున్నాడు.

2017 చివర్లో ఇంగ్లాండ్ ఫాస్ట్‌బౌలింగ్ కోచ్‌గా నియమితులైన క్రిస్ ప్రస్తుతం హెడ్‌గా ఎంపిక కావడం విశేషం. ఇంగ్లాండ్ తరఫున సిల్వర్‌వుడ్ ఆరు టెస్టులు, ఏడు వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. 184 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 577 వికెట్లు తీశాడు. నవంబర్‌లో ఇంగ్లాండ్ టీమ్ ఐదు టీ20లు, రెండు టెస్టుల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది.

Related posts