telugu navyamedia
తెలంగాణ వార్తలు

కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో యువత జీవితాన్ని ఫణంగా పెట్టొద్దు ..

కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌ దాడి కేసులో అరెస్టై చంచల్​గూడ జైల్లో ఉన్న ఆర్మీ అభ్య‌ర్ధుల‌తో శుక్రవారం నాడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ములాఖత్ అయ్యారు.

వీలైనంత త్వరగా వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని జైలో ఉన్న యువ‌కులు హామీ ఇచ్చారు. యువకులవి న్యాయమైన డిమాండ్లేనని.. వారి పోరాటానికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుందని రేవంత్ భరోసానిచ్చారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడారు.. మోడీని నమ్మి యువత బీజేపీ కి ఓటేశారన్నారు. కానీ ఆర్మీ రిక్రూట్ మెంట్ లో ఆగ్నిప‌త్‌ ను తీసుకొచ్చి యువత ఆశలపై నీళ్లు చల్లారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కేంద్రంలోని బీజేపీ సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో యువత జీవితాన్ని ఫణంగా పెట్టొద్దని ఆయన కోరారు.

ప్రతి ఏటా ఆర్మీలో 70 వేల మందిని పాత పద్దతిలో రిక్రూట్ మెంట్ చేసే వారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. చట్టాలు, శాసనాలను పక్కన పెట్టి అగ్నిపథ్ ను అమలు చేస్తామంటే ఎలా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

‘సైనికులకు ప్రత్యేకమైన గౌరవం దక్కేలా ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. నాలుగేళ్లు పనిచేయించుకుని ఇంటికి పంపిస్తే తర్వాత వారి సంగతేంటి? మోదీ సర్కారు జవాన్లలో గందరగోళం సృష్టించింది.

ఆర్మీ అభ్యర్ధులపై 307 సెక్షన్ కింద ఎలా కేసులు నమోదు చేస్తారని ప్రశ్నించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరసన తెలిపేందుకు వచ్చిన వారిపై 307 సెక్షన్ తో పటు నాన్ బెయిలబుల్ కేసులు ఎలా నమోదు చేస్తారని ఆయన ప్రశ్నించారు.

ఆర్మీ అభ్యర్ధులపై పెట్టిన 307 తో పాటు నాన్ బెయిలబుల్ కేసులను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగ..అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తు హాజ‌రుకావాల‌ని, కేంద్రం తీసుకొచ్చిన అగ్నిప‌థ్‌ను తీవ్రస్థాయిలో వ్యతిరేకించాల‌ని పిల‌పునిచ్చారు.

Related posts