telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దేశ రాజధానిలో భారీ వర్షాలు.. ఎగరని విమానాలు..

no flight service on huge rain in delhi

ఢిల్లీలో గత రాత్రి కురిసిన భారీవర్షంతో వరదనీరు రోడ్లపై పారింది. భారీవర్షంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడటంతో అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. భారీవర్షాలు, గాలుల ఉద్ధృతి వల్ల ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన పలు విమాన సర్వీసులను నిలిపివేశారు. గురువారం రాత్రి భారీ గాలులు వీస్తూ కురిసిన భారీవర్షం వల్ల పలు విమాన సర్వీసులను నిలిపివేశామని ఢిల్లీ విమానాశ్రయం అధికారులు చెప్పారు.

ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 బ్యాగేజ్ చెక్ ఇన్ ఏరియాలో వర్షపునీరు లీక్ అయింది. దీనివల్ల నాలుగు విమానాలను దారి మళ్లించారు. భారీవర్షాల ప్రభావం పలు విమానసర్వీసుల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపించిందని విస్తారా, స్పైస్ జెట్ విమాన సంస్థలు ట్విట్టర్ లో ప్రకటించాయి. ఢిల్లీలో 35.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Related posts