ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం పెరుగుతుంది. ఈ మేరకు ప్రజల మధ్య సామాజిక దూరాన్ని పాటించాలని ప్రభుత్వాధికారులు కోరారు. ఆరు బయట పది మంది కలిసి తిరగడం, గుంపులుగా తిరగడం చేయకూడదని ఆదేశించారు. ఈ మేరకు లాక్ డౌన్ కూడా ఏర్పాటు చేశారు. గత నాలుగు నెలలు ప్రజలు ఇళ్లకే పరిమితమై ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కేవలం నిత్యావసర సరుకులను కొనుగోలు చేయడానికి లేదా అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటకు రావాలని సూచించారు.అంతేకాదు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. అయిన కరోనా ప్రభావం పెరుతుంది.
ఇక చేసేదేమీ లేక అన్నీ వాణిజ్య, వ్యాపార సంస్థలను మూసి వేశారు. ఈ మేరకు సినిమా హాళ్లను కూడా మూసివేశారు. దాంతో పాటుగా సినిమా షూటింగ్ లను కూడా నిలిపివేశారు. ఇకపోతే కరోనా కొంతవరకు తగ్గడంతో ఇప్పుడు మళ్లీ థియేటర్లను ఓపెన్ చేయాలనే ఆలోచనలో చిత్ర పరిశ్రమలోని పెద్దలు ఉన్నారని తెలుస్తుంది. ఇటీవల ఈ విషయం పై చర్చలు జరిపి ప్రభుత్వం ఆదేశించిన కరోనా నిబంధనలను పాటిస్తూ థియేటర్లను ఓపెన్ చేయవచ్చునని వెల్లడించారు. అయితే కొన్ని షరతులు కూడా పెట్టారు. అవి పాటించక పోతే థియేటర్ యాజమాన్యాల మీద కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ, సినీ ఇండస్ట్రీ పెద్దలు పేర్కొన్నారు.
రాయలసీమ బాగుపడాలంటే గోదావరి నీళ్లు రావాలి: చంద్రబాబు