telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

శ్రీ శ్రీ ఎవరు?

అతడు 

ఓ కవి

కవిత్వానికి 

శ్రీకారం చుట్టిన 

ఓ రవి

ఆ వాడిలో..

మంట పుట్టించే వేడి

ఒక్కటే కాదు..

జానపద గీత బ్రహ్మగా..

శృంగార శ్రీనాథునిగా

ఎన్నో రసవంతమైన..

రాగాలు కూనిరాగాలుగా

కోటి గొంతులలో పలికాయి..

అందుకే కాబోసు .

ఆయననన్నారు *శ్రీ శ్రీ* అని. 

అలా అని అక్కడే ఆగిపోలేదు..

శ్రమజీవి చెమటలో

ఆక్రందనల కోటలో..

అన్యాయాన్ని ఎదిరిస్తూ..

కలమెత్తి, గళమెత్తిన పులి..

ఆయనను ఎరగని వాడు లేడు..

ఆయన పదమెత్తని వాడూ లేడు..

ఆయన లేకపోయినా 

చిరస్మరణీయుడే!

అమరుడైన చిరంజీవే!

ఆయనే 

శ్రీరంగంశ్రీనివాసరావు

Related posts