telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

చంద్రయాన్‌-2 ఉపగ్రహం … తీసిన తొలి ఫోటో …

chandrayan-2 sent first photo of moon

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌-2 ఉపగ్రహం చంద్రుడిని ఫోటో తీసి పంపింది. చంద్రయాన్‌-2 చంద్రుడ్ని తీసిన తొలి ఫోటో ఇదేనని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. ఈ మేరకు గురువారం ఇస్రో ట్వీట్‌ చేసింది. ఆగస్టు 21న చంద్రుడి ఉపరితలానికి 2,600 కిలోమీటర్ల ఎత్తులో తీసిన ఫోటో అని పేర్కొంది. ఈ చిత్రంలో చంద్రుడి దక్షిణార్ధగోళంలో ఉన్న అపోలో క్రేటర్స్‌ బిలం, పశ్చిమ అంచులో ఉన్న మేర్‌ ఓరియంటేల్‌ అనే మరొక పెద్ద బిలాన్ని ఇస్రో గుర్తించింది.

ఈ ఉపగ్రహం చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన అనంతరం దీర్ఘవృత్తాకారంగా తిరుగుతున్న దశలో ఉపగ్రహ కక్ష్యను బుధవారం మరింత తగ్గించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 7న చంద్రునిపైకి ల్యాండర్‌ దిగనున్న నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో 20 నిమిషాల పాటు ఇంజిన్లను మండించి కక్ష్యను కుదించారు.

Related posts