*144 సెక్షన్ విధించిన పోలీసులు
*జిల్లా పేరు మార్చవద్దని కొనసీమ సాధన కమిటీ ఆందోళన
*అమలాపురం కలశం నుంచి కలెక్టరేట్ వరకు జిల్లా సాధన కమిటీ ర్యాలీ..
*కలెక్టేరేట్ చేరుకున్న వేలాదిమంది నిరసనకారులు
*అమలాపురాన్ని అష్టదిగ్బంధనం చేసిన పోలీసులు
*అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పోలీసులకు, నిరసన కారులకు మధ్య ఉద్రిక్తత..
*పోలీసులపై నిరసన కారులు రాళ్లదాడి..
*20 మంది పోలీసులకు పైగా గాయాలు..
*సొమ్మసిల్లి పడిపోయిన డీఎస్పీ..
కోనసీమలో ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకుంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం 13 జిల్లాలను కాస్త 26 జిల్లాలు మారుస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొనసీమ జిల్లా ను డా.అంబేద్కర్ జిల్లాగా మారస్తూ ఏపీప్రభుత్వం నోటీసు జారీ చేసింది.
అయితే దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు కోనసీమ పేరును కొనసాగించాలని డిమాండ్ తో కోనసీమ జిల్లా సాధన సమితి ఆందోళన చేపట్టింది. ఇవాళ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు.
ఈ ఆందోళనను పురస్కరించుకొని అమలాపురంలో ఇవాళ 144 సెక్షన్ విధించారు. అమలాపురంలో 25 చోట్ల పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అయితే ఒక్కసారిగా జేఎసీ నేతృత్వంలో ఆందోళనకారులు గడియారం స్థంభం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ గాపరుగులు తీశారు.
అయితే ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసు జీపుపై, పోలీసులపై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు.దీంతో ఆందోళనకారులను తరలిస్తున్న రెండు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్ల దాడి నుంచి ఎస్పీ సుబ్బారెడ్డి త్రుటిలో తప్పించుకున్నారు.
అయితే అక్కడే ఉన్న డీఎస్పీ, గన్ మెన్లుతో పాటు 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. దొరికినవారిని దొరికినట్టుగా చితకబాదారు. ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. పోలీసుల లాఠీచార్జీలో కూడా పలువురు ఆందోళనకారులు కూడా గాయపడ్డారు.