telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అవినీతి నిరోధానికి .. ఏపీసీఎం సరికొత్త ఒప్పందం..

ap logo

ఏపీ లో అవినీతి నిరోధక పాలన అందించేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్న యువ ముఖ్యమంత్రి తాజాగా అవినీతిపై నిరోధం పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ విభాగాల్లో అవినీతికి ఆస్కారమున్న అంశాలపై అధ్యయనం, సిఫార్సుల కోసం అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ విద్యాసంస్థ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో అహ్మదాబాద్‌ ఐఐఎం ప్రజా విధానాల బృందం ప్రొఫెసర్‌ సుందరవల్లి నారాయణస్వామి, రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ చీఫ్‌ విశ్వజిత్‌ సంతకాలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడాన్ని తమ సంస్థకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ప్రొఫెసర్‌ సుందరవల్లి నారాయణస్వామి పేర్కొన్నారు. అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో తమ పాత్ర ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎక్కడెక్కడ అవినీతి జరుగుతోంది? ఎక్కడ ఆస్కారం ఉంది? దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి?.. ఇలాంటి అంశాలపై ఐఐఎం అహ్మదాబాద్ సమగ్రంగా పరిశీలించనుంది.

Related posts