telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

సాయం చేసేందుకు మరో అడుగు ముందుకేసిన సోనూసూద్…

Sonu-Sood

సినిమాలలో విలన్ పాత్రలు చేసిన కరోనా లాక్ డౌన్ కష్ట కాలంలో రీల్ విలన్ నుంచి రియల్ హీరోగా మారాడు సోనూసూద్ . అత్యంత కఠిన పరిస్థితుల్లో అవసరం ఉన్న వారిని ఆదుకుని ఎన్నో కుటుంబాలకి అండగా నిలిచాడు. పేదలకు, అవసరం ఉన్న వారికి సహాయం చేస్తున్న సోనూసూద్‌ను ప్రజలు దేవుడిలా కొలుస్తున్నారు. ప్రతిరోజు కొత్త కొత్త సేవా కార్యక్రమాలు చేస్తున్న సోనూసూద్. ఇప్పుడు మరో అడుగు ముందుకేశాడు. సోనూసూద్ అంబులెన్స్ సర్వీస్‌ని ప్రారంభించి ప్రమాదంలో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందకు వస్తున్నాడు. ఇటీవల కొన్న వ్యాన్స్‌ను కొనుగోలు చేసిన సోనూ వాటిని అంబులెన్స్‌లుగా మార్చి వాటి ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు ఈ సర్వీస్‌ను తీసుకురానున్నాడు. ఈ సర్వీస్‌ను హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో ప్రారంభించాడు. రానున్న రోజుల్లో వీటిని మరింతగా విస్తృతం చేస్తామని తెలిపాడు. అంతేకాకుండా ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో మెడికల్ సర్వీస్‌లను అందుకోలేని వారికి ఇవి సహాయం చేస్తాయని, వీటి ద్వారా సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి చేయూతనిచ్చి రక్షించ గలుగుతామని సోనూ అన్నాడు. దాంతో అందరూ ఆయన పై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.

Related posts