telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ఆక‌స్మిక త‌నిఖీ…

Errabelli Trs

ఈరోజు జ‌న‌గామ జిల్లాలోని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాన్ని ఆక‌స్మికంగా త‌నిఖీ చేసిన నీటిసర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు.. కోవిడ్ వ్యాప్తి నివార‌ణ‌లో భాగంగా ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆద్వ‌ర్యంలో మాస్కుల పంపిణీ చేశారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు చేప‌డుతుంద‌ని, కోవిడ్ వ్యాప్తి జ‌రుగకుండా ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని సూచించారు. ఈ సంధ‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్ర‌తి గింజ‌ను ప్ర‌భుత్వం కొన‌గోలు చేస్తుంద‌ని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ధాన్యం కొనుగోలులో చేతులెత్తేసింద‌ని, రాష్ట్రానికి ఏ మాత్రం స‌హ‌క‌రించ‌కున్నా.. రైతుల ప‌క్ష‌పాతి, రైతుల స‌మ‌స్య‌లు తెలిసిన మ‌న సీఎ కేసిఆర్.. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్ర‌భుత్వం ద్వారా కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించార‌ని తెలిపారు. కోవిడ్ నేప‌థ్యంలో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకుని రైతులు పంచించిన ప్ర‌తి ధాన్యం గింజ‌ను కొనుగోలు చేయాల‌ని ఆదేశించినట్లు చెప్పారు.

Related posts