ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన దూకుడు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నికలు సంక్రమంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఏపీ సీఎస్‌కు వరుసగా లేఖలు పంపి.. రాష్ట్ర రాజకీయాలనే మలుపు తిప్పుతున్నారు. అయితే తాజాగా.. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ-వాచ్ యాప్‌ను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఆవిష్కరించారు. పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ కోసం ఈ యాప్‌ను రూపకల్పన చేసింది ఏపీ ఎన్నికల సంఘం. ఈ యాప్‌తో నేరుగా ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉండనుంది. ఎన్నికల్లో అక్రమాలు, ప్రలోభాలపై ఫిర్యాదుకు అవకాశం ఉండనుంది. ఈ ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనుంది ఎన్నికల సంఘం. ఈ యాప్ ఆవిష్కరణ సందర్భంగా నిమ్మగడ్డ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో ఫిర్యాదులు ఎస్‌ఈసీ దృష్టికి తీసుకురావచ్చని..గతంలోనూ టెక్నాలజీని ఎన్నికల కోసం వాడామని గుర్తు చేశారు. రేపటి నుంచి ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. అత్యంత పారదర్శకంగా ఈ యాప్‌ను రూపొందించామని..ఫిర్యాదు పరిష్కారమైందా లేదా అనేది కాల్ సెంటర్ ద్వారా తెలుసుకుంటామని స్పష్టం చేశారు. యాప్‌ను తామే రూపొందించామని.. ఎవరికీ సంబంధం లేదన్నారు. ఎన్నికల్లో అక్రమాలు, ప్రలోభాలపై ఫిర్యాదుకు ఈ యాప్‌తో అవకాశం ఉంటుందని తెలిపారు నిమ్మగడ్డ.
next post
అర్ధరాత్రి ఇసుక ఆన్ లైన్ బుకింగ్ ఎందుకు?: పవన్ కల్యాణ్