telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తమకు మూడు ప్రాంతాలు సమానమే: జగన్

ys jagan cm

వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ఏపీ సీఎం జగన్ ఏలూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు మూడు ప్రాంతాలూ సమానమే అని చెప్పారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండబోతున్నాయనే సంకేతాలను మరోసారి ఇచ్చారు. అందరి అభివృద్ధి కోసం సరైన నిర్ణయాలను తీసుకొంటున్నామన్నారు. దేవుడి దయతో వచ్చిన ఈ పదవిని అందరి అభివృద్ధి కోసం ఉపయోగిస్తామని అన్నారు.

అన్ని ప్రాంతాలకు మేలు చేసేలా తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. గత ప్రభుత్వం కొందరికే న్యాయం చేసిందని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాలను సరిదిద్దుతామని చెప్పారు. అన్ని ప్రాంతాలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేలా చూస్తామని తెలిపారు. అందరి అభివృద్ధి కోసం సరైన రీతిలో పాలన కొనసాగిస్తామని జగన్ పేర్కొన్నారు.

Related posts