telugu navyamedia
రాజకీయ వార్తలు

పౌరసత్వ చట్టం విషయంలో మోదీ జోక్యం చేసుకోవాలి: మమత

mamatha benerji

దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పౌరసత్వ చట్టం విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని పచ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ విన్నవించారు. ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. జాతీయ పౌర జాబితాను అమలు చేయాలనే ఆలోచనను కూడా విరమించుకోవాలని అన్నారు.

పౌరసత్వ సవరణ చట్టంపై ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో రెఫరెండం నిర్వహించాలంటూ మమతా బెనర్జీ డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తన వ్యాఖ్యలపై ఆమె వివరణ ఇచ్చారు. తాను రెఫరెండం అని అనలేదని… ఓటింగ్ అని మాత్రమే అన్నానని చెప్పారు.  .పౌరసత్వ చట్టం, జాతీయ పౌర జాబితాలపై ఒపీనియన్ పోల్ జరగాలని కోరారు.

Related posts