telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

ఈ నెల 31 వరకు గాంధీలో ఓపీ బంద్!

karona ward in gandhi hospital

కరోనా బాధితులు రోజు రోజుకు పెరుగుతుండడంతో హైదరాబాద్ లోని గాంధీ, చెస్ట్ హాస్పిటల్స్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ ప్రత్యేక వార్డులన్నీ నిండిపోయాయి. విదేశాల నుంచి వచ్చినా, లేదా అలాంటి వారితో కలిసి ఉన్నా వివిధ దవాఖానల నుంచి గాంధీకి సిఫారసు చేయడంతో రద్దీ పెరిగిందని అధికారులు తెలిపారు.

సోమవారం జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతూ అధిక సంఖ్యలో ప్రజలు గాంధీ దవాఖానాకు తరలివచ్చారు. కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకున్నారు. వారి రక్త నమూనాలను సేకరించి, ల్యాబ్‌లో వైరస్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించి, నెగిటివ్‌ అని తేలగానే, సర్టిఫికెట్‌ అందజేసి ఇంటికి పంపిస్తున్నారు.

ఒకవేళ కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే ఐసోలేషన్‌ వార్డులో అడ్మిట్‌ చేస్తున్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన దృష్ట్యా ప్రజా రవాణా వ్యవస్థ నిలిచిపోయిందని ప్రజలు దవాఖాన చేరుకోవడాని ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఈ నెల 31 వరకు ఓపీ వైద్య సేవలు నిలిపివేస్తున్నామని అధికారులు తెలిపారు.

Related posts