telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

మార్చి 31 వరకు అందరూ ఇళ్లలోనే ఉండండి: హరీశ్‌ రావు

harish rao trs

కరోనా విజృంభణపై తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు స్పందించారు. 2019 డిసెంబర్ లో చైనా లోని వూహాన్ నగరంలో బయటపడ్డ ఈ వైరస్ 150 దేశాలకు పాకిందిని తెలిపారు. ఈ వైరస్ మన దేశం లోకి మన రాష్ట్రం లోకి కూడా ప్రవేశించింది. నిన్నటిదాకా రాష్ట్రంలోకి వచ్చిన విదేశీయులలోనే కనిపించిన ఈ వ్యాది ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఉన్న వారికి కూడా సోకుతున్నది. ఇది ప్రాణాంతకమైన వైరస్. ఇది సోకకుండా ఉండేందుకు వాక్సిన్ ఇంకా కనుక్కోలేదు. ఇప్పుడు మనల్ని మనం కాపాడుకోగాలిగేది కేవలం ముందు జాగ్రత్తల ద్వారా మాత్రమే’ అని హరీశ్‌ రావు అన్నారు.

ఇప్పటివరకు తెలుస్తున్న సమాచారం ప్రకారం చైనాలో సుమారు 5,000 మంది మరణించగా ఇటలీలో ఇంతకు రెట్టింపు 10,000 మంది మరణించారు. ‘చేతులు జోడించి అందరినీ వేడుకుంటున్నాను. దయచేసి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు తీసుకునే జాగ్రత్తల వల్ల మీరు మీ ప్రాణాన్ని కాపాడుకోవటమే కాకుండా వేలాది మంది ప్రాణాలు కాపాడిన వాళ్లవుతారు. మార్చి 31 వరకు అందరూ ఇళ్లలోనే ఉండండని తెలిపారు.

Related posts