telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వావిలాల గ్రామంలో రైతు వేదికను ప్రారంభించిన ఈటల…

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో రైతు వేదికను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాకు కేసీఆర్‌కు 20 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు.. ఇన్నేళ్ల అనుబంధంలో నాకు కేసీఆర్ పై అజమాయిషీ ఉంటుందని వ్యాఖ్యానించారు ఈటల.. రైతులు ఏమనుకుంటున్నారో చెప్పాల్సిన బాధ్యత నాపై ఉందన్న ఆయన.. ఆరేళ్ల కాలంలో కేసీఆర్ అనేక సార్లు మీటింగ్‌లు పెట్టింది కేవలం వ్యవసాయం మీద మాత్రమేనని గుర్తు చేశారు.  ఇక, నాలాంటి వాడు ఉపన్యాసం ఇస్తే నిజమని అందరూ భావిస్తారు… అర్థం అయ్యేలా చెప్పాల్సి ఉంటుందన్నారు మంత్రి ఈటల రాజేందర్… రైతు ఏడిస్తే తట్టుకోలేని వ్యక్తి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఒక్కడేనన్న ఆయన.. మన ప్రాంతంలో పండిన సీడ్ మరేక్కడ పండదన్నారు. కేసీఆర్ మనస్తత్వం నాకు తెలుసు.. వ్యవసాయ రంగంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉండాలనేది ఆయన కోరిక అన్నారు ఈటల.. ఇవాళ కేసీఆర్ ఉన్నా లేకపోయినా, నేను మంత్రిగా ఉన్న లేక పోయినా.. రైతులకు అండగా ఉంటామని ప్రకటించారు. కాగా, కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి మేలు జరిగేలా కేటాయింపులు చేశామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. మరోవైపు.. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. అయితే నిన్న కూడా పదవులు, రైతుల సమస్యలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్… ఇప్పుడు మరోసారి చర్చకు తెరలేపే వ్యాఖ్యలు చేశారు.

Related posts