telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కొత్త పార్టీలు వస్తాయి.. పోతాయి.. మాది జాతీయ పార్టీ

వైఎస్‌ షర్మిల పార్టీ పెడతారనే వార్తలు రాగానే.. తెలంగాణలోని అన్ని పార్టీలు తీవ్రస్థాయిలో స్పందించాయి. ఏపీ పార్టీ తెలంగాణలో అవసరమా.. ఫ్యాక్షన్‌ రాజకీయాలు ఇక్కడ రుద్దుతారా అని తెలంగాణ లోని అన్ని పార్టీలు మండిపడ్డాయి. అయితే.. తాజాగా దీనిపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు స్పందిచారు.  ఏ కొత్త పార్టీ వచ్చినా దాని వెనకాల ప్రగతి భవన్ మూలం ఉంటుందని  ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. కొత్త పార్టీలు ఎన్నో వస్తాయి.. పోతాయి..తమది జాతీయ పార్టీ అని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొత్త పార్టీల ఏజెండా ఏంటో.. సిద్దాంతాలేంటో తెలియదన్నారు. అసలు కొత్త పార్టీలకు అవకాశం లేదు, ఉండబోదని పేర్కొన్నారు.
సిద్దాంతం స్పష్టతలేని పార్టీలు ప్రాంతీయ పార్టీలు అని..కేంద్రం తెచ్చిన చట్టాల వల్ల రైతులకు నష్టమన్నారు. సీఎం కేసీఆర్‌… ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టి పెట్టిన విషయం రైతులకు అర్థమైందని.. కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయడం సరైంది కాదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఎత్తివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. రైతుల కోసం ఉద్యమం చేస్తామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. బీమా డబ్బులు రాకపోవడానికి సీఎం బాధ్యత వహించాలని శ్రీధర్ బాబు అన్నారు.

Related posts