ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. నాలుగు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అయింది. ఇక తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. అయితే.. ఈ ఫలితాల్లో నిమ్మాడలో టీడీపీ పార్టీ బలపర్చిన అభ్యర్థి కింజరాపు సురేష్ గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి అప్పన్నపై 1700 ఓట్ల మెజార్టీతో సురేష్ గెలుపు బావుట ఎగురవేశారు. వైసీపీ బలపర్చిన అప్పన్నకు కేవలం 157 ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి వర్గం సంబరాల్లో మునిగిపోయింది. ఇది ఇలా ఉండగా…. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిమ్మాడలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా వైసీపీ బలపర్చిన అభ్యర్థి అప్పన్నను అచ్చెన్నాయుడు సహా పలువురు టీడీపీ నేతలు బెదిరించారనే ఆరోపణలు వైసీపీ వచ్చాయి. దీంతో సర్పంచ్ అభ్యర్థిని బెదిరించారని అచ్చెన్నాయుడుతో సహా 22 మందిపై నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో భాగంగా ఫిబ్రవరి 2న అచ్చెన్నాయుడితో సహా 22 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. అచ్చెన్నాయుడు ఇవాళ బెయిల్‌పై రిలీజ్ అయి స్వగ్రామానికి చేరుకున్నారు.
previous post
ఆదాయానిచ్చే హైదరాబాద్ ఏపీకి లేకుండా పోయింది: జగన్