telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత్-ఆసీస్ మొదటి రోజు : ఆధిపత్యం కనబరిచిన ఆసీస్

ఐపీఎల్ 2020 ముగిసిన తర్వాత టీం ఇండియా ఆసీస్ పర్యటనకు వెళ్ళింది. ఇక ఈరోజు అడిలైడ్ వేదికగా ఈరోజు భారత్-ఆసీస్ మధ్య పింక్ సమరం ప్రారంభమైంది. అయితే ఈరోజు మ్యాచ్ లో రెండు జట్లు హోరాహోరీగా పోటీ పడ్డాయి. మొదటి రోజు ముగిసే సమయానికి భారత్ 233 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా కు మొదట్లో షాక్ ఇచ్చారు ఆసీస్ బౌలర్లు. మ్యాచ్ మొదటి ఓవర్లోనే ఓపెనర్ పృథ్వీ షా(0) ను వెనక్కి పంపిన కాసేపటికే మరో ఓపెనర్ మయాంక్(17) ను పెవిలియన్ కు చేర్చారు. దాంతో భారత్ 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఇక ఆ తర్వాత పుజారా, కోహ్లీ కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిదే ప్రయత్నం చేసారు. వీరి 78 పరుగుల భాగసౌమ్యం వద్ద పుజారా(43) క్యాచ్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత కూడా తన దూకుడు తగ్గించని కోహ్లీ అర్ధశతకం పూర్తి చేసాడు. కానీ 74 పరుగుల వద్ద మిస్ కమ్యూనికేషన్ తో రన్ ఔట్ అయ్యాడు. అయితే అప్పటికే 80 ఓవర్లు పూర్తి చేసిన ఆసీస్ కొత్త బంతిని తీసుకొని రహానే(42), విహారి(16) లను పెవిలియన్ కు చేర్చారు. ఇక ప్రస్తుతం సాహా(9), అశ్విన్(15) వద్ద బ్యాటింగ్ చేస్తుండగా మొదటి రోజు ముగిసింది. అయితే ఆసీస్ బౌలర్లలో స్టార్క్ రెండు వికెట్లు తీసుకోగా జోష్ హాజిల్‌వుడ్, కమ్మిన్స్, నాథన్ లియోన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. చూడాలి మరి రేపు ఏం జరుగుతుంది అనేది.

Related posts