telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

డైరెక్టర్ త్రినాథరావు నక్కిన చేతులమీదుగా “తురమ్ ఖాన్ లు” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గ్రాండ్ లాంచ్.

తెలుగు ఇండస్ట్రీలో తెలంగాణ నేపథ్యంలో వస్తున్న మరో తెలంగాణ పల్లె కథ చిత్రం “తురుమ్ ఖాన్ లు”.
స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఎండీ. ఆసిఫ్ జానీ నిర్మాతగా, శివకళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పనులు ముగించుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం నుంచి తొలి సాంగ్ రంగు రంగుల చిలక పాట విడుదలైంది. ధమాకా ఫేమ్ దర్శకుడు త్రినాథరావు నక్కిన చేతులమీదుగా మొదటి పాట ఘనంగా విడుదలైంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతోంది.

ఈ సందర్భంగా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ… తెలంగాణ నేపథ్యంలో సినిమా రావడం అదీ కామెడీ నేపథ్యంలో ఉండటం… ఈ సినిమా నుంచి నా చేతుల మీదుగా తొలి పాటను విడుదల చేయడం మరి సంతోషంగా ఉందని అన్నారు. ఈ చిత్రంలో “రంగు రంగుల చిలుక” పాటను ప్రముఖ సింగర్ మంగ్లీ పడటం చాలా సంతోషంగా ఉందని, అలాగే మంగ్లీ పాట అంటే ప్రేక్షకుల్లో ఎంతో ఉత్సాహం ఉంటుందని ఈ పాట వింటుంటే చాలా పెద్ద హిట్ అవుతుందని తెలిపారు. ఇంకా మాట్లాడుతూ తెలంగాణ కామెడీ నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తూ… నా చేత పాటను లాంచ్ చేయాలన్న ఆలోచన వచ్చినందుకు తురుం ఖాన్ లు చిత్ర దర్శకనిర్మాతలకు థాంక్స్ చెబుతూ.. కామెడీ అనగానే నేను గుర్తుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని డైరెక్టర్ త్రినాథరవు నక్కిన తెలిపారు. పాటతో పాటు సినిమా కూడా చాలా పెద్ద హిట్ కావాలని.. చిత్ర యూనిట్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

పల్లెటూరు రివెంజ్ కామెడీ జానర్ లో మొదటి సారి మహబూబ్ నగర్ స్లాంగ్ లో తెరకెక్కెక్కించిన ఈ చిత్రం షూటింగ్ ముగించుకొని, ప్రస్తుతం నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుపుకుంటుంది. దాదాపు దశాబ్ద కాలంగా ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా, డైలాగ్ రైటర్ గా పనిచేసిన ఎన్ శివ కళ్యాణ్ తురుమ్ ఖాన్ లు సినిమాకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ త్రీనాథరవు నక్కిన కు ధన్యవాదాలు తెలిపారు. పాటతో పాటు సినిమా కూడా విజయవంతం అవుతుందని… మొదటి పాటను ఆదరించవలసిందిగా ప్రేక్షకులను కోరారు.

నిర్మాత అసిఫ్ జానీ మాట్లాడుతూ.. బలమైన కథ, సహజమైన పాత్రలు ఉన్న ఈ చిత్రాన్ని క్వాలిటీగా రూపొందించామని,అన్ని పనులను ముగించుకొని త్వరలోనే ప్రేక్షకులముందుకు వస్తున్నట్లు తెలిపారు. తురుమ్ ఖాన్ లు సినిమా నుంచి మొదటి పాట విడుదల చేసిన ప్రముఖ డైరెక్టర్ త్రీనాథరవు నక్కినకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే పాట అందరికి నచ్చుతుందని, అందరూ ఆదరించాలని కోరారు.

నటీనటులు: నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి, పులి సీత, విజయ, శ్రీయాంక తదితరులు

రచన-దర్శకత్వం : ఎన్ శివ కల్యాణ్
నిర్మాత: ఎండీ అసిఫ్ జానీ
ఎడిటర్: నాగేశ్వర రెడ్డి బొంతల,
సినేమోటోగ్రఫీర్: అంబటి చరణ్,
సంగీత దర్శకులు: వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు, రియాన్.
ఎఫెక్ట్స్: వెంకట శ్రీకాంత్
మిక్సింగ్ : సంతోష్ కుమార్
ప్రొడక్షన్ హెడ్: రజిని కాంత్, శివ నాగిరెడ్డి పల్లి
ఎక్స్ గ్యూటివ్ ప్రొడ్యూసర్: దేవరాజ్ పాలమూర్
ఆర్ట్ డైరెక్టర్: రేమో వెంకటేష్
సహా నిర్మాత: కే. కళ్యాణ్ రావు
పీఆర్ఓ: హరీష్, దినేష్

Related posts