telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

18 తరువాతే పెళ్లా.. టాస్క్ ఫోర్స్..

course should pass before marriage is a rule

18 నిండితేనే బాలికలకు పెళ్లి చేయాలనీ చట్టపరంగా రూల్స్ ఉంటాయి. ఒకవేళ అంతకంటే తక్కువ వయసులో పెళ్ళిళ్ళు చేస్తే దాని వలన ఇబ్బందులు పడటమే కాకుండా, ఆడపిల్లలు కూడా శారీరకంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే పెళ్లి విషయంలో ఖచ్చితంగా 18 నిండాల్సిందే అన్నది ఇప్పటి వరకు రూల్. 18 సంవత్సరాల వయసు ఉంటె దాని వలన అమ్మాయికి అన్ని విషయాల్లో సరైన అవగాహన వస్తుంది. అవగాహనతో పాటుగా అన్ని విధాలుగా కూడా ఇబ్బందుల నుంచి తప్పుకున్నట్టు అవుతుంది. కొంతమంది వ్యక్తులు బాల్యవివాహాలను ప్రోత్సహిస్తూ ప్రజలు ఇబ్బందులు పడేలా చేస్తున్నారు. దీని వలన సమాజం కూడా ఇబ్బందులు పడుతున్నది.

దీని నుంచి బయటపడేందుకు ప్రభుత్వం కొన్ని విధానాలను తీసుకొచ్చింది. అదేమంటే, ఏ వయసులో పెళ్లి చేసుకుంటే మంచిది అనే విషయం తెలుసుకోవడం కోసం ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయబోతున్నారు. బడ్జెట్ సెషన్ లో చెప్పినట్టుగా అన్ని రకాలుగా స్త్రీలను, మహిళలను ఆదుకుంటామని ప్రభుత్వం చెప్తున్నది. మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం అందరికి ఆమోదయోగ్యంగా ఉండబోతున్నట్టు చెప్తున్నారు. స్త్రీ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని, స్త్రీలు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలని, ఉంటారని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

Related posts