telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“రాక్షసుడు”కు సీక్వెల్…!

Raakshasudu

తమిళ్ లో సూపర్ హిట్ అయిన “రాట్ససన్” చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా “రాక్షసుడు” అనే టైటిల్ తో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని రమేష్ వర్మ తెరకెక్కించారు. అక్కడ ఎలాంటి విజయాన్ని ఈ చిత్రం అందుకుందో ఇక్కడ కూడా అంతే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులను థ్రిల్ చేసి ఆకట్టుకుంది ఈ చిత్రం. అయితే మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇప్పటికే చిత్ర యూనిట్ స్టోరిను సిద్ధం చేస్తున్నారట. అలాగే మొదటి భాగంలో కనిపించిన నటులతోనే ప్లాన్ చేస్తున్నట్టు టాక్. కానీ ఇది ఒరిజినల్ లో కాబట్టి అక్కడ ఇంకా సీక్వెల్ కు దర్శకుడు రామ్ కుమార్ ప్లాన్ చెయ్యలేదు. ఈ చిత్రం వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Related posts