telugu navyamedia
రాజకీయ వార్తలు

మసీదుకు వెళ్ల‌ను.. స్పష్టం చేసిన యోగి

yogi adityanath

అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం కోసం భూమిపూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్ర‌కారం వివాదాస్ప‌ద స్థలంలో మ‌సీదును కూడా నిర్మించాల్సి ఉన్న‌ది. ఒక‌వేళ ఆ మ‌సీదు ప్రారంభోత్స‌వానికి ఆహ్వానం వ‌స్తే, ఆ కార్య‌క్ర‌మానికి ఓ హిందువుగా తాను వెళ్లద‌లుచుకోలేద‌ని యోగి తెలిపారు.

ఓ మీడియా ప్ర‌తినిధి అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న బదులిస్తూ.. ముఖ్యమంత్రిగా మతాలతో తనకు ఎలాంటి సమస్య లేదని… కానీ, ఒక హిందువుగా మాత్రం ఆ పని చేయలేనని తెలిపారు. మసీదు నిర్మాణంలో తాను భాగస్వామిని కానని చెప్పారు. కొందరు నేతలు మాత్రం టోపీ పెట్టుకుని, ఇఫ్తార్ లకు వెళ్తూ, సెక్యులర్ అని చెప్పుకుంటున్నారని యోగి విమర్శించారు.

Related posts