telugu navyamedia
సినిమా వార్తలు

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కు క‌రోనా పాజిటివ్

కరోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి విజృంభిస్తుంది. దేశంలో క‌రోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సినీ పరిశ్రమ పై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్‌, కోలీవుడ్ స‌హా ప‌లు సినీ పరిశ్ర‌మ‌ల్లో చాలా మంది ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డుతున్నారు.

తాజాగా లెజెండరీ సింగర్ ల‌తా మంగేష్క‌ర్ క‌రోనా బారిన ప‌డ్డారు.. ప్రస్తుతం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. లతా మంగేష్కర్‌కు స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నప్పటికీ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Happy Birthday Lata Mangeshkar: Netizens shower love on the veteran  singer's special day | PINKVILLA

ఆమె బాగానే ఉంది. ఆమె వయస్సును దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త గా మాత్రమే ఐసీయూలో చేర్చామ‌ని , దయచేసి మా గోప్యతను గౌరవించండి అంటూ ఆమె మేనకోడలు రచనా ట్వీట్ చేశారు. అయితే లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని సినీప్రియులు, అభిమానులు కోరుకుంటున్నారు.

Related posts