బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కరోనా టైంలో బంగారం ధరలు ఆమాంతం పెరిగాయి. అయితే… బులియన్ మార్కెట్‌లో రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్‌లోనూ బంగారం ధరలు పెరిగి పోయాయి. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ పెరిగి పోయాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెరిగి రూ. 48,000 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 44,000 పలుకుతోంది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు మాత్రం కాస్త పెరిగాయి. కిలో వెండి ధర రూ. 700 పెరిగి రూ.73,500 వద్ద కొనసాగుతోంది.
previous post
పులివెందుల అరాచకాలు రాష్ట్రం మొత్తం పేట్రేగాయి: చంద్రబాబు