telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మే 15 వరకు కరోనా ఖతమే : సిఎం కెసిఆర్

కరోనా నియంత్రణ కోసం ప్రజలు కూడా పూనుకోవాలనీ, ప్రతి వ్యక్తీ స్వచ్ఛందంగా కరోనా మీద యుద్ధంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. సమిష్టిగా అందరం కలిసి కొట్లాడితేనే కరోనా అంతమవుతుందని అన్నారు. మేధావులు, బుద్దిజీవులు ఈ దిశగా ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు.
కరోనా నియంత్రణలో ప్రాణాలకు తెగించి పాటుపడుతున్న వైద్య ఆరోగ్యశాఖకు అభివందనాలు తెలియచేశారు. వైద్యులు, నర్సులు, ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు తదితర వైద్య సిబ్బంది గొప్ప సేవ చేస్తున్నారని వారి కృషి త్యాగం గొప్పదని కొనియాడారు. రెండో వేవ్ మే 15 తర్వాత కరోనా తీవ్రత తగ్గిపోతుందని రిపోర్టులు సూచిస్తున్నాయన్నారు. వ్యాధి నిరోధానికి ఎవరికివారే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలే స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. గుంపులు గుంపులుగా తిరగొద్దని పెండ్లిల్లలో వందకు మించి జమ కావద్దని తెలిపారు. పరిశుభ్రత పాటించాలని, సానిటైజర్లు వాడాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని తెలిపారు. ఇటువంటి జాగ్రత్తలే శ్రీరామ రక్షగా పేర్కొన్నారు.

Related posts