telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

పెళ్ళి చేసుకుంటే జీతం ఇస్తామంటున్న ప్రభుత్వం… ఎక్కడంటే…?

Kuwait

తెలంగాణాలో పెళ్లిళ్లు చేసుకుంటే ప్రభుత్వం నుంచి “కళ్యాణ లక్ష్మీ” పథకం అందుతోంది. అయితే ఆ దేశంలో మాత్రం పెళ్లిళ్లు చేసుకునే మహిళలకు ఏకంగా నెలనెలా జీతాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ దేశమే కువైట్… అయితే ఈ జీతం పొందాలంటే మాత్రం కొన్ని షరతులు తప్పనిసరి. అవేంటంటే… ప్రైవేట్ సెక్టార్‌లో ఉద్యోగం చేస్తున్న మహిళలు, కంపెనీలు, ఇన్‌స్టిట్యూట్లూ స్థాపించిన మహిళలు దీనికి అనర్హులు. ఈ జీతం పొందే మహిళలు ఇంట్లో పనుల్లో సాయం చేయడానికి పనిమనిషిని పెట్టుకోవచ్చు. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ పనిమనిషిగా మగవారిని తీసుకోకూడదు. ఈ ఉచిత జీతం పథకం వల్ల కుటుంబ బంధాలు బలోపేతం అవుతాయని, దీని వల్ల కువైట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న విడాకుల కేసులను తగ్గించడానికి, స్త్రీలు పిల్లల పోషణ, వారి ఎదుగుదలపై దృష్టి పెట్టడానికి వీలు కల్పించినట్లు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.

Related posts