ఏపీ సర్కార్ పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శనాస్త్రాలు సంధించారు. రైతులు భూములు త్యాగం చేస్తే వారికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం కౌలు ఇవ్వట్లేదని విమర్శించారు. రెసిడెన్షియల్ ప్లాట్లు అమ్మడానికి మీకెవరు అధికారం ఇచ్చారంటూ ట్విట్టర్ వేదికగా దేవినేని ఉమ జగన్‌ను నిలదీశారు.
ఎన్నికలకు ముందే ఏకగ్రీవంగా ప్రజా రాజధానిగా అమరావతి, సీఆర్డీఏ చట్టం నిర్ణయం జరిగింది. అమరావతి గ్రాఫిక్స్ కాదని, ఇది నిజమైన రాజధాని అని వ్యాఖ్యానించారు. జీవో ఇచ్చి రెండు నెలలైనా 186 కోట్ల రైతుల కౌలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు చేతులు రావడంలేదు? అని ప్రశించారు.
మరో 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా జగన్: మోహన్ బాబు