telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మారాలి పురుషుల భావాలు

నిస్వార్ధం నిర్మలంగా వుంటుంది
స్వార్థం భారంగా వుంటుంది
ఎదుటి వారి గురించి ఆలోచించటం మానేసి
మనం ఎంటి అని తెలుసుకోవడమే జీవితం
పేద వారిని చూసి గేలి చేయడం
ధనవంతులకి వత్తాసు పలకడం మానవ నైజం
అందరూ మంచివారే
మరి చెడు ఎవరిదగ్గరవుంది
వ్యవస్థ కాదు వ్యక్తి మారాలి
ధృక్పదాన్ని మార్చుకోవాలి
గురువే దైవం అన్నారు మరి గురువే
గుడిసేటి పనులు చేస్తున్నాడు
పాఠశాలల్లో భద్రత కరువైంది
దీనికి భాద్యులు ఎవరు???????
మన భావ జాలాన్ని మార్చుకోవాలి
చూసే చూపు మాట్లాడే మాట పవిత్రంగా వుంటే
పొరపాటు మనదరి చేరదు
మారాలి పురుషుల భావాలు
కామమే జీవితం కాదు
భార్య బిడ్డలు భాద్యతలు వున్నాయి కదా
మీ వల్ల వారు నష్ట పోతున్నారు

Related posts