telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్‌ శివారుల్లో రేవ్ పార్టీ…

నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్‌లో జరుగుతోన్న రేవ్‌ పార్టీపై దాడి చేసిన పోలీసులు.. పెద్ద సంఖ్యలో అమ్మాయిలు, అబ్బాయిలును అరెస్ట్ చేశారు.. మొత్తంగా రేవ్ పార్టీ నడుపుతున్న 90 మంది యువకులుని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.. ఈ  90 మంది అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఉన్నారు.. సంస్థాన్ నారాయణపురంలోని ఒక రిసార్ట్‌లో గుట్టుగా రేవ్ పార్టీ నిర్వహిస్తూ వస్తున్నారు.. అయితే, స్థానికుల సమాచారంతో రేవ్ పార్టీని భగ్నం చేశారు రాచకొండ పోలీసులు.. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఈ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇక, నిర్వాహకులతో పాటు.. యువతి, యువకులను అదుపులోకి తీసుకుని.. ఎక్కడి నుంచి వచ్చారు.. ఎలా నిర్వహిస్తున్నారు.. ఎంత కాలం నుంచి ఈ వ్యవహారం నడుస్తోంది అనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. అయితే, పోలీసుల దాడితో పది మంది యువకులు పరారైనట్టుగా చెబుతున్నారు.. పరారైన యువకుల్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.. దొరికిన 90 మంది యువకులతో పాటు అమ్మాయిలను విచారిస్తున్నారు రాచకొండ పోలీసులు.. రేవ్‌ పార్టీ నిర్వహణ ప్రాంతంలో పెద్ద మొత్తంలో మద్యం స్వాధీనం చేసుకున్నారు.

Related posts