telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

చైనాలో క్లినికల్ ట్రయల్స్ విజయవంతం

corona vaccine India

చైనాలో కరోనా వైరస్ కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ అన్నీ పూర్తయ్యాయి. క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్ కారణంగా ఎటువంటి సైడ్ ఎఫెక్టులూ ఉండబోవని రెండు నెలల క్రితమే తేలింది. ఆపై ఇది మానవ శరీరంలో కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీలు తయారు కావడానికి దోహదపడుతోందని తేలడంతోనే ప్రభుత్వం ఆమోదించింది.

‘ఏడీ5-ఎన్ సీఓవీ’ పేరిట దీన్ని అడినో వైరస్ ఆధారంగా వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. తొలుత సైనిక అవసరాలకు వాక్సిన్ ను వినియోగించాలని జిన్ పింగ్ సర్కారు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెలువరించింది. కాన్సినో బయోలాజిక్స్ తయారు చేసిన ఈ వ్యాక్సిన్ పురోగతిపై ఇటీవల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తొలుత సైనిక అవసరాలకు అందించాలని సంస్థకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Related posts