telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఈనెల 17న అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం..

ఈనెల 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మహారాష్ట్ర, కర్ణాటక , తెలంగాణ సీఎంలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. లిబరేషన్ డేను ఏడాదిపాటు నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు.

విమోచన దినోత్సవం నిర్వహించకుండా అమరులను కేసీఆర్‌ అవమానిస్తున్నారు. ప్రారంభ కార్యక్రమన్ని సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్‌లో నిర్వహించాలని నిర్ణయించినట్లు కిషన్‌రెడ్డి సీఎంలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి వస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ గెస్ట్ ఆఫ్ హనర్‌గా హాజరు కావాలని కిషన్ రెడ్డి ఆహ్వానం తెలిపారు. తెలంగాణ సీఎంతో పాటు, మహారాష్ట్ర సీఎం ఎక్ నాథ్ షిండే, కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మైకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖలు రాశారు.

కాగా కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ రచ్చకు దారితీసింది. కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన 8ఏళ్ల తర్వాత బీజేపీకి లిబరేషన్ డే గుర్తొచ్చిందా అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా దీనిపై స్పందిచలేదు. అయితే టీఆర్ ఎస్ మాత్రం దీనిని రాజకీయ స్టంట్ గా భావిస్తోంది. కేంద్రప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఈకార్యక్రమంపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Related posts