ఖమ్మం కాంగ్రెస్ ఏమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ సీఎం కేసీఆర్ పై ఆగరహం వ్యక్తం చేసాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులను మోసం చేయడానికి పూనుకున్నాడు. ఎన్నికల కోడ్ వున్న 29 % ఫీట్ మెంట్ ఇస్తా అని చెప్పడం ఓట్లకోసం అని అర్థం చేసుకోండి అని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని, దరిద్ర రాష్ట్రంగా చేసింది తెరాసా ప్రభుత్వం.జీతాలకే డబ్బులు ఇవ్వలేని స్థితిలో 29% ఫీట్ మెంట్ ఇస్తా అని మరో సారి మోసం చేయడానికి పూనుకున్నాడు. చదువుకున్న విద్యావంతులు, పట్టభద్రులు ఈ మాయ మాటలు నమ్మే స్థితిలో లేరు. ఉద్యోగ సంఘాల నాయకులు ఆలోచించండి.. మాయ మాటలు నమ్మకండి. PRC వచ్చి మూడు నెలలు అయినా అప్పడి నుండి మాట్లాడకుండా, ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోతం అనే బయంతో అడ్డదారుల్లో గెలవాలని చూస్తున్నారు. ఎన్నికల కొడు ఉల్లంఘించి 29% ఫీట్ మెంట్ అని ప్రకటించిన,లీకులు చేసిన ముఖ్యమంత్రిపై ఎన్నికల కమీషన్ కేసు నమోదు చేయాలి. ఉద్యోగాల కల్పన , పదోన్నతులు ,ఉద్యోగాల భర్తీ విషయంలో చిత్తశుద్ధి తో చేసిన ప్రకటనలు కావు. ఓట్లు,సీట్ల కోసం చేసిన ప్రకటన అని విద్యావంతులు ఆలోచించాలి. రాబోయే ఎన్నికల్లో నాకు ఓటు వేసి గెలిపించాలి అని కోరారు. చూడాలి మరి ఈ ఎన్నికలో ప్రజలు ఏ విధమైన తీర్పు ఇవ్వనున్నారు అనేది.
previous post
జేడీఎస్ కార్యకర్తలంతా వ్యభిచారులే: సిద్ధరామయ్య