ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో గత 12 రోజులగా జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని జమ్మూకశ్మీర్ చీఫ్ సెక్రటరీ బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. ఇవాళ శ్రీనగర్‌లో మీడియాతో మాట్లాడారు. శాంతి భద్రతల నేపథ్యంలో ముందస్తుగా కొందర్ని అరెస్టు చేయాల్సి వచ్చిందన్నారు. అనేక చోట్ల టెలికం ఆంక్షలను విధించామన్నారు. అయితే సోమవారం నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నట్లు ఆయన చెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థను క్రమంగా ఆపరేట్ చేస్తామన్నారు. ఇవాళ్టి నుంచే ప్రభుత్వ ఆఫీసులు పనిచేస్తున్నాయని సుబ్రమణ్యం చెప్పారు. దశల వారీగా టెలికం సేవలను పునరుద్దరించనున్నట్లు తెలిపారు.
ఎంపీటీసీ గెలవని పంచాయతీలకు నిధులు రావు : వైసీపీ ఎమ్మెల్యే