తెలంగాణలో చోటు చేసుకున్న ఈఎస్ఐ కుంభకోణంలో ముగ్గురు నిందితులను ఏసీబీ అరెస్ట్ చేసింది. వెంకటేశ్వర హెల్త్ కేర్ ఎండీ అరవింద్ రెడ్డితో పాటు కె.లిఖిత్ రెడ్డి, కె.రామిరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి మొత్తం అరెస్ట్ లు 13కు చేరాయి.
ఈఎస్ఐ డైరెక్టర్ పద్మతో కలసి అరవింద్ రెడ్డి అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈఎస్ఐకి పరికరాలు సరఫరా చేసినట్టుగా తప్పుడు పత్రాలను సృష్టించి అవినీతికి పాల్పడ్డారు. 2013 నుంచి ఈయన అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని చంద్రబాబు పారిపోయారు: మోత్కుపల్లి