తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతుంది. సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లతో ప్రభుత్వం బస్సులు నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోకొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో హనుమాన్ విగ్రహం వద్ద రెండు బస్సులపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరి ద్వంసం చేశారు.
కాగజ్‌నగర్ నుంచి ఆసిఫాబాద్ వైపు వెళ్తున్న బస్సుపై దుండగులు రాళ్లు విసరడంతో ధ్వంసమైంది. దాంతోపాటు మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ వెళ్తున్న మరో బస్సుపై కూడా ఇదే తరహా దాడి జరిగింది. దీంతో బస్సు స్వల్పంగా ధ్వంసమైంది. ఊహించని ఘటనలతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దాడికి పాల్పడిన వ్యక్తులు పరారయ్యారు. దాడులపై పోలీసులు విచారణ ప్రారంభించారు. సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అప్పులన్నీ తమపైకి నెట్టి.. టీడీపీ విమర్శలకు దిగుతోంది: మంత్రి బుగ్గన