telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ సమ్మెపై కేంద్రానికి నివేదికలు: బీజేపీ నేత లక్ష్మణ్

BJPpresident -K-Laxman

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేంద్రానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమ్మె పై కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో స్పందిస్తుందని చెప్పారు. సమ్మెపై రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరించదన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే మాత్రం కేంద్రం కలుగజేసుకుంటుందని అన్నారు.

ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సమ్మెపై ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామన్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా పోరాడిన నాయకులను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. మందకృష్ణ అరెస్ట్ అన్యాయం అని ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. కార్మికులకు మద్దతుగా 19న రాస్తారోకోకు తానే నాయకత్వం వహిస్తానని లక్ష్మణ్ తెలిపారు.

Related posts