ప్రస్తుతం తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా రీమేక్ అవుతున్న రొమాంటిక్ కామెడీ మూవీ ‘ఓ మై కడవులే’. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను పీవీపీ సంస్థతో కలిసి దిల్ రాజు దీనిని నిర్మిస్తున్నారు. తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన అశ్వత్ మరిముత్తు తెలుగు రీమేక్ కూ దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ రచన చేస్తున్నాడు. తమిళ మూవీ విడుదల కాగానే ప్రిన్స్ మహేశ్ బాబు… మెచ్చుకుంటూ ట్వీట్ చేయడంతో సినీజనం దృష్టి దీనిపై పడింది. విశేషం ఏమంటే… ఇప్పుడీ సినిమాను హిందీలోనూ రీమేక్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ‘102 నాటౌట్’ వంటి సెన్సిబుల్ మూవీని తెరకెక్కించిన ఉమేశ్ శుక్లా రచన చేస్తూ, నిర్మించబోతున్న హిందీ మూవీకి కూడా అశ్వత్ మరిముత్తు నే దర్శకత్వం వహిస్తాడట. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న తెలుగు సినిమా షూటింగ్ పూర్తి కాగానే హిందీ రీమేక్ పై దృష్టి పెడతానని అశ్వత్ చెబుతున్నాడు. మొత్తానికి ఒకే సినిమాను బ్యాక్ టు బ్యాక్ తెలుగు, హిందీ భాషల్లో అశ్వత్ రీమేక్ చేయడం విశేషమే! చూడాలి మరి తమిళ ప్రజలను ఆకట్టుకునే ఈ సినిమా తెలుగు, హిందీ లో హిట్ అందుకుంటుందా… లేదా అనేది.
previous post
next post
టీఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది: ఉత్తమ్