telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : మరో కొత్త నియమం తీసుకొచ్చిన బీసీసీఐ…

ipl

ఐపీఎల్ 2021 కోసం బీసీసీసీ మరో కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. జట్లు స్లో ఓవర్‌రేట్‌ నమోదు చేస్తే కఠిన చర్యలు తీసుకోనుంది. సాఫ్ట్‌ సిగ్నల్‌ తొలగింపు, షార్ట్‌ రన్‌పై థర్ఢ్‌ అంపైర్‌ కన్ను, 90 నిమిషాల్లోనే ఒక ఇన్నింగ్స్‌ పూర్తి చేయడం లాంటి కీలక నిర్ణయాలు బీసీసీఐ ఇప్పటికే తీసుకుంది. ఈ రూల్స్‌ అన్ని ఐపీఎల్ 2021‌ ప్రారంభం నుంచే అమల్లోకి రానున్నాయి. అయితే స్లో ఓవర్‌రేట్‌ కారణంగా కొన్ని మ్యాచ్‌లు సమయం కంటే ఎక్కువసేపు జరుగుతున్నాయి. దీంతో స్లో ఓవర్‌రేట్ నమోదు చేసే ఆయా జట్లకు బీసీసీఐ జరిమానా విధించనుంది. ఒక జట్టు మొదటిసారి స్లో ఓవర్‌ రేటు నమోదు చేస్తే.. సదరు జట్టు కెప్టెన్‌కు రూ. 12 లక్షల జరిమానా… రెండోసారి అదే పునరావృతం అయితే.. ఆ జట్టు కెప్టెన్‌కు రూ. 24 లక్షల జరిమానాతో​ పాటు జట్టులోని సభ్యులందరి ఫీజులో నుంచి రూ. 6 లక్షలు లేదా 25 శాతం కోత విదిస్తుంది. అయితే ఇక్కడ కెప్టెన్‌కు మినహాయింపు ఉంటుంది. ఇక మూడోసారి కూడా అదే రిపీట్‌ అయితే మాత్రం కెప్టెన్‌కు రూ .30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్‌ ఆడకుండా నిషేదం పడనుంది. దీంతో పాటు జట్టు సభ్యులందరి మ్యాచ్‌ ఫీజు లోంచి రూ. 12 లక్షలు లేదా 50శాతం కోత విధించనున్నారు. ఇక్కడ కూడా కెప్టెన్‌కు మినహాయింపు ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మ్యాచులు అన్ని నిర్ణీత సమయంలోనే ముగిసే అవకాశం ఉంది.

Related posts