telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తెలంగాణలో మరో కొత్త పార్టీ..

ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. షర్మిల కొత్త పార్టీ పెడతారన్న వార్తతో తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తిని పెంచాయి. షర్మిల ఈ నెల 9న పార్టీ ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మరో పార్టీ కావాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌ వ్యతిరేకులతో కలిసి తెలంగాణలో కొత్త పార్టీ పెడతానని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. అంతేకాదు.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కేసీఆర్‌ వ్యతిరేకులను స్వయంగా కలుస్తానని ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను దారుణంగా దోచుకుంటోందని ఆయన ఆరోపణలు చేశారు. తాను టీఆర్‌ఎస్‌ తరఫున తీరు నచ్చక కాంగ్రెస్‌ పార్టీలో చేరానని పేర్కొన్నారు. అయితే.. కాంగ్రెస్‌ పోరాడే తత్వాన్ని మరిచిపోయిందని.. అందుకే ఆ పార్టీని వీడానని స్పష్టం చేశారు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ చేస్తున్న అరాచకాలను ప్రజల్లో ఎండగట్టేందుకు సిద్ధమయ్యానని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యతిరేక శక్తులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి తగిన బుద్ది చెబుతానని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి రేవంత్‌ అని.. అటు టీఆర్‌ఎస్‌ను హరీష్‌రావు అసలు వదలిపెట్టరని పేర్కొన్నారు.

Related posts