telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : టాస్ గెలిస్తే మ్యాచ్ ఓడిపోతున్నారు.. ఎందుకు..?

ప్రస్తుతం కరోనా కారణంగా యూఏఈ లో జరుగుతున్న ఐపీఎల్ 2020 లో టాస్ గెలిచినా జట్లే ఎక్కువగా మ్యాచ్ ఓడిపోతున్నాయి. క్రికెట్ లో టాస్ ఎంతో కీలకం. వాతావరణ పరిస్థితులను, జట్టు బలాన్ని అంచనా వేసుకొని టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఎంచుకుంటాడు. ఈ విషయం అందరికి తెలిసిందే. పరిస్థితులను అంచనా వేసి కెప్టెన్ ఎంచుకునే బ్యాటింగ్, బౌలింగ్ ఆ జట్టుకు ప్లేస్ పాయింట్.  కాని యూఏఈ లో జరుగుతున్న ఐపీఎల్ 2020 లో మాత్రం ఇందుకు భిన్నంగా సాగుతుంది. యూఏఈ లో కెప్టెన్ లా అంచనాలు బోల్తా కొడుతున్నాయి. ఇప్పటివరకు ఈ సీజన్ లో జరిగిన మ్యాచ్ లలో సగానికి పైగా టాస్ గెలిచిన జట్టే పరాజయాన్ని చవిచూసింది. యూఏఈ లో మొదట టాస్ గెలిచిన వారంతా బౌలింన్గ్ ఎంచుకుంటే ఇప్పుడు మాత్రం బ్యాటింగ్ ఎంచుకుంటున్నారు. అయితే మాములుగా మ్యాచ్ ప్రారంభమైన తర్వాత రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసే జట్టును తేమ ఇబ్బంది పెడుతుంది. ఆ బౌలర్లకు బంతి పై పట్టు ఉండదు. కానీ యూఏఈ లో పరిస్థితులు భిన్నంగా ఉండటం, అలాగే తేమ అనుకున్నంతగా ప్రభావం చూపించకపోవడం కారణంగా ఈ పరిస్థితులు ఎదురుపడుతున్నాయి . అంతే కాకుండా కొన్ని మ్యాచ్ లలో ఆటగాళ్ల వైఫల్యం కారణంగా కూడా మ్యాచ్ లు ఓడిపోతున్న జట్లు.

Related posts