ఒకపక్క మతాన్ని ప్రేమిస్తున్నాం, గోవు పూజనీయం అని చెప్తున్నా అందులో చిత్త శుద్ధి లేదని వాళ్ళు చేసే పనులతో అర్ధం అవుతుంది. ప్రస్తుతం బీజేపీ నేతలు చేస్తున్న పనులు అలాగే ఉన్నాయి. ఆ పార్టీనేత ఉద్యోగం ఇప్పిస్తానంటూ.. ఓ మహిళా కార్యకర్తపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇప్పటికే బీజేపీ బూజుపట్టి పోతుంటే, ఇలాంటి ఘటనలు దానికి ఆజ్యం పోసినట్టుగా ఉన్నాయంటూ అధిష్టానం తలలు పట్టుకుంటుంది. వివరాలలోకి వెళితే, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికిన ఓ రాజకీయ నేత సొంత పార్టీకి చెందిన మహిళా కార్యకర్తపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో చోటుచేసుకుంది. దీంతో అతనిపై ఆగ్రహించిన పార్టీ యాజమాన్యం బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఇక్కడి బల్బీర్ రోడ్డులోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనే తనపై లైంగికదాడి చేశాడని వాపోయింది. ఈ ఘటన మీడియాలో రావడంతో సంజయ్ ను పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఈ సందర్భంగా తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు ఆందోళనకు దిగింది. మరోవైపు బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులు ఎప్పటికి తేలతాయో, ఎప్పటికి శిక్షలు ఖరారు అవుతాయో.. అప్పటిదాకా ఆ నేత బాహాటంగానే అధికారం చెలాయిస్తూనే ఉంటాడు.. ఇది మన చట్టం దౌర్బాగ్యం. దర్యాప్తుల పేరుమీద నిధులు దండగ తప్ప, ప్రయోజనం శూన్యం.. న్యాయం కూడా అంతే.
సంజయ్ మంజ్రేకర్ కు బీసీసీఐ షాక్.. కామెంటరీ ప్యానల్ లో దక్కని స్థానం!