telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

పండుగపూట మరో విషాదం..గాలిపటం ఎగురవేస్తూ బాలుడు మృతి

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరూ నిన్న సంక్రాంతి పండుగను చాలా సంతోషంగా జరుపుకున్నారు. అయితే సంక్రాంతి పండుగ రాగానే అందరికీ గుర్తుకు వచ్చేది గాలిపటాలు. అయితే… ఈ గాలిపటాలు ఎగురవేసేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి.  ఇక సరదాగా చిన్నపిల్లలు గాలిపటం ఎగరవేస్తుంటే మాత్రం.. తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి. అంతే కాదు… రోడ్డున వెళ్తున్న సమయంలో… అడ్డుగా మాంజా ఉందేమో గమనిస్తే మంచిది. కాస్త అజాగ్రత్తగా ఉంటే.. అంతే మన ప్రాణాలకే ముప్పు.  అయితే… తాజాగా ఈ గాలిపటం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నది.  ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో చోటు చేసుకుంది.  వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నలవెళ్లి గ్రామంలో కొండూరు సాయిలు- వెంకటమ్మ కొడుకు రాకేష్ [13] గాలిపటం ఎగురవేస్తూ మృతి చెందాడు. గాలిపటం ఎగురవేస్తున్న నేపథ్యంలో… వైర్లల్లో చిక్కింది పతంగి. అయితే.. ఆ పతంగిని ఇనుప రాడ్ తోని లాగడం వల్ల కరెంట్ షాక్ వచ్చి రాకేష్ అక్కడికక్కడే మరణించాడు. అతన్ని కాపాడడానికి రాకేష్ వాళ్ళ అక్క వచ్చి ప్రాణం మీదికి తెచ్చుకుంది. రాకేష్ ను కాపాడే ప్రయత్నంలో వాళ్ల కూడా కరెంట్‌ షాక్‌కు గురైంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోని ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది.

Related posts