telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఆయుర్వేద వైద్యానికి మోదీ ప్రభుత్వం పెద్దపీట…

Kishan Reddy

కరోనా విలయతాండవం ఇంకా కొనసాగుతోంది. కొన్ని దేశాల్లో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. తీవ్రత మాత్రం తగ్గడం లేదు. మన దేశం లో రోజుకు వేల సంఖ్యలో కేసులు వందల సంఖ్యలో మరణాలు సమోదవుతున్నాయి. ఇక ఈ వైరస్‌కి వ్యాక్సిన్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. కరోనా వ్యాక్సిన్‌ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని.. అప్పటి వరకు ప్రతి ఒక్కరూ ఆయుర్వేద నియమాలను పాటించాలన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. యోగా తరహాలో ఆయుర్వేద వైద్యానికి మోదీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఇక తాజాగా ఈ మహమ్మారి మానసిక సమస్యలను సృష్టిస్తున్నట్టు ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ అధ్యయనంలో తేలింది. కరోనా మెదడుపై ప్రభావం చూపడంతో పాటు నిద్రలేమి, మనోవ్యథ, కుంగుబాటు, ఒత్తిళ్లు, ఆదుర్దా, ఆందోళన, అయోమయం వంటి మానసిక అనారోగ్యాలకు కారణమవుతున్నట్టు ఆ అధ్యయనంలో వెల్లడైంది. ప్రతి ఐదు మందిలో ఒకరికి మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, దీంతో వారు ఆస్పత్రులకు చికిత్సకు వస్తున్నట్టు సమాచారం.

Related posts