telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలకు కేంద్రం కీల‌క ఆదేశాలు…

వంద‌లాది క‌రోనా బాధితుల మృత‌దేహాలు గంగా న‌దిలో తేల‌డం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ నేప‌థ్యంలో.. ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలకు కీల‌క ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. గంగా నదిలో మృతదేహాలపై వస్తున్న కథనాలు ఆందోళనకరంగా ఉన్నాయని, ఇది అవాంఛనీయమని పేర్కొన్న కేంద్రం.. క‌రోనా మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరింది. ఆరోగ్య శాఖతో సంప్రదించి తరచూ గంగా నదిలోని నీటిని పరీక్షించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్ళను ఆదేశించింది కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ.. మ‌రోవైపు.. గంగా నదిలో మృతదేహాలు తేలుతూ కనిపిస్తున్నాని ఫిర్యాదులు అందడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ మే 13న స్పందిస్తూ.. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ, ఉత్తర ప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.. దీంతో.. మృత‌దేహాలు గంగా న‌దిలో ప‌డేయ‌కుండా చ‌ర్య‌ల‌కు పూనుకుంటున్నాయి ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు.

Related posts