telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వర్షాలపై అప్రమత్తంగా ఉండండి….కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు

KTR

వాయుగుండం ప్రభావంతో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రంగం అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సర్వీసుల్లో భాగంగా అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ఉండేలా చూసుకోవాలని మంత్రి కేటీఆర్ గారు జిల్లా కలెక్టర్,ఎస్పీలను ఆదేశించారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలు, వరదల పరిస్థిని మంత్రి కేటీఆర్ కలెక్టర్, ఎస్పీలను ఫోన్ ద్వారా ఆరా తీశారు. నీట మునిగిన ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి కావలసిన సదుపాయాలు అందించాలని, 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ నడిపించాలని సూచించారు. ప్రాణ నష్టం జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, ఆస్తి నష్టం అంచనా వేసి బాధితులకు అండగా నిలవాలని అన్నారు. జిల్లాలోని మిడ్ మానేరు, అప్పర్ మానేరు ప్రాజెక్టులకు వరద ఉదృతి తీవ్రంగా ఉన్నందున, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మానేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నందున సంబంధిత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షాలు పూర్తిగా తగ్గే వరకు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ పని చేయాలన్నారు.

Related posts