telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ…

IPL

ఐపీఎల్ 2021 ను యూఏఈకి తరలించాలని నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అధికారికగా ప్రకటించారు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో మిగిలిపోయిన 31 మ్యాచ్‌లను సెప్టెంబర్ – అక్టోబర్‌లో పూర్తి చేయాలనుకున్న బీసీసీఐ.. ఆ సమయంలో భారత్‌లో వాతావరణం అనుకూలించదని, వర్షాలు ఉంటాయి కాబట్టి యూఏకి తరలించడం ఉత్తమమనే ఏకాభిప్రాయానికి వచ్చింది. విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా లేకున్నా యూఏఈ వేదికగా అనుకున్న సమాయానికే ఐపీఎల్ ఫేజ్‌ 2 పూర్తవుతుందని బీసీసీఐ అధికార వర్గాలు స్పష్టం చేశాయి. విదేశీ ఆటగాళ్ల గైర్వాజరీపై ఎస్‌జీఎంలో బోర్డు సభ్యులు ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయలేదు. ‘యూఏఈ ఫేజ్-2ను యూఏఈ వేదికగా మళ్లీ నిర్వహించేందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సంతోషంగా ముందుకు వచ్చింది. గతేడాది మాదిరే షార్జా, దుబాయ్, అబుదాబి వేదికగా లీగ్ జరుగుతుంది. విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండటంపై ఆయా క్రికెట్ బోర్డులతో బీసీసీఐ సంప్రదింపులు జరపనుంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లంతా లీగ్‌లో ఆడనున్నారు. కానీ ఇంగ్లండ్, న్యూజిలాండ్ ప్లేయర్లు పాల్గొనడంపైనే సందేహాలు నెలకొన్నాయి. మా దిశగా మేం ప్రయత్నాలు చేస్తాం. 25 రోజుల విండోలో లీగ్ పూర్తి చేయాలనుకుంటున్నాం’అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి ఏఎన్‌ఐకి తెలిపారు. 

Related posts